ఎంపీపీ దశరథ్ రెడ్డి
ప్రభుత్వ విద్యాసంస్థలు నాణ్యమైన విద్యను అందించి, పేదలకు మెరుగైన విద్యను అందించాలని మంగళవారం ఎంపీపీ దశరథ్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి, విద్యార్థుల వార్షిక ఫలితాల సాధనలో విఫలమైనందుకు, అధ్యాపకులతో సమావేశమై, విద్యార్థులకు మెరుగైన నాణ్యమైన విద్యను బోధించి, వచ్చే విద్యా సంవత్సరమైనా మెరుగైన ఫలితాలను సాధించేందుకు, అధ్యాపకులు సమయపాలన పాటిస్తూ, కార్యాచరణ రూపొందించుకుని నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీలో రికార్డులను పరిశీలించారు. రికార్డులు సరిగా లేవని అంగన్ వాడి టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ అవార్డు వచ్చినందున పీహెచ్ సి లో వైద్యులను, సిబ్బందిని శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చాలు అందజేశారు. రాబోవు రోజుల్లో కూడా ప్రజలకు మంచి వైద్యాన్ని అందించే, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రవీందర్రావు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మా గౌడ్, వైద్యులు సురేష్, బి ఆర్ ఎస్ నాయకులు లింబాద్రి నాయక్, జంగం లింగం, మాజీ ఎంపిటిసి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
