నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సిర్పూర్ శాసన సభ్యులు పాల్వాయి హరీష్ బాబు.ఆసిఫాబాద్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన ఆస్పిరేషనల్ జిల్లా సమావేశంలో భాగంగా సంపూర్ణత అభియాన్ కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సిర్పూర్ శాసన సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వెనుకబడిన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను కేంద్ర ప్రభుత్వం ఆస్పిరేషనల్ జిల్లాగా గుర్తించిందని,అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ టీబ్రేవాల్, డి ఆర్ డి ఓ సురేందర్, జడ్పిటిసి సభ్యులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అభివృద్ధికి అధికారులు తోడ్పాటు అందించాలి
RELATED ARTICLES
