ద్రోణ హైదరాబాద్
రవీంద్ర భారతిలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దొడ్డి కొమురయ్య చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు.మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి ఆనాటి దొడ్డి కొమురయ్య పోరాటమే స్పూర్తి. నిజాం నిరంకుశత్వానికి, దేశ్ ముఖ్ ల వెట్టికి, ఆగడాలకు వ్యతిరేఖంగా పోరాడి వీరమరణం పొందిన వీరుడు దొడ్డి కొమురయ్య.
హైదరాబాద్ లో దొడ్డి కోమురయ్య విగ్రహం ఏర్పాటు చేస్తాం.
