నేడు సిపిఐ జిల్లా కార్యాలయంలో అమరులు దొడ్డి కొమురయ్య 76వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర నాయకులు కె.భూమయ్య మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ ప్రాంత విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మొట్టమొదటి అమరులు దొడ్డి కొమురయ్య అని అన్నారు. దొడ్డి కొమురయ్య పోరాటస్ఫూర్తితోటే నాడు పది లక్షల భూమి పంపకం జరిగిందని, వెట్టి చాకిరి నుండి వేలాది గ్రామాలు విముక్తి కావడం.

జరిగిందని ఈ పోరాటంలో 4500 మంది సిపిఐ కార్యకర్తలు ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగిందని వీరందరి పోరాటం మూలంగానే నాటి నైజాం పాలనలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనం కావడం జరిగిందని అన్నారు దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తితో కార్యకర్తలు పని చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్, సిపిఐ జిల్లా నాయకులు వై.ఓమయ్య, కే.రాజన్న, సాయిలు, జనార్ధన్, ఆనంద్, రాధాకుమార్ తదితరులు పాల్గొన్నారు.
