Wednesday, February 25, 2026

ఘనంగా మాజీ ముఖ్యమంత్రి రోశయ్య 91వ జయంతి

హాజరైన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతులు నెహ్రూ

ద్రోణ అమరావతి ప్రతినిది

కాకినాడ జిల్లా జగ్గంపేట జులై 4: స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ కీర్తిశేషులు కొనిజేటి రోశయ్య 91వ జయంతి వేడుకలు జగ్గంపేట మండల ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు చిత్రపు బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ ప్రముఖ కాంగ్రెస్ వాది మాజీ ముఖ్యమంత్రి మాజీ తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య జీవితకాలం కాంగ్రెస్ లోనే పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతికి దాహోదా పడ్డారని తమిళనాడు గవర్నర్ తన చివరి రోజుల్లో మంచి సేవలు అందించారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో అప్పలరాజు, మారిశెట్టి భద్రం,జగ్గంపేట టౌన్ ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త కొండబాబు, జగ్గంపేట మండలం పరిషత్ అధ్యక్షులు అత్తులూరి నాగబాబు, కొత్త రాము, కొత్త సుధీర్, మానేపల్లి బంగార్రాజు, వీర సత్య అధిక సంఖ్యలో ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular