విద్యాసంస్థల బంద్ విజయవంతం
బోధన్ లో విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు
అప్రజాస్వామ్యమైన చర్య
విద్యాసంస్థల్లో పోలీసుల జోక్యం సరికాదు
ఏ ఐ పీ ఎస్ యు బోధన్ డివిజన్ కార్యదర్శి సాయికుమార్

ఈ రోజు ఐక్య విద్యార్థి సంఘాల (ఏఐపి యస్ యు,యన్ యస్ యు ఐ,ఏ ఐ యస్ ఎఫ్, యస్ యప్ ఐ, పి డి యస్ యు) ఆధ్వర్యంలో బోధన్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో బంద్ ముఖ్య ఉద్దేశాన్ని వివరించి, శాంతియుతంగా పాఠశాలలో కళాశాలలో బంద్ చేయడం. జరిగిందని ఏ ఐ పీ ఎస్ యు బోధన్ డివిజన్ కార్యదర్శి సాయికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ( ఏఐ పి యస్ యు) బోధన్ డివిజన్ కార్యదర్శి సాయికుమార్ మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా నీట్ ప్రశ్నపత్రాల లీక్ పై విద్యార్థులు, తల్లిదండ్రులు నెల రోజులపాటు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కేవలం నామమాత్రంగా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి సిబిఐ విచారణ చేస్తున్నామంటూ కాలయాపన చేస్తున్నారు. వెంటనే నీట్,ఎన్టిఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా కేజీ టు పేజీ విద్యాసంస్థల బంద్ కు ఐక్య విద్యార్థి సంఘాల పిలుపులో భాగంగా ఈరోజు అన్ని పాఠశాలలు,కళాశాలలో బంద్ చేయడం జరిగిందన్నారు.

నీట్ పరీక్ష పత్రాల లిక్ విషయంలో పెద్ద మాఫియా దాగి ఉందని అందుకోసమే కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో దోషులను బయటపడనివ్వకుండా కాపాడుతుందన్నారు.సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో కమిటీ వేసి పూర్తిస్థాయిలో దోషులను శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.దీనితోపాటు Neet, NTA రద్దుచేసి పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని, వచ్చే సంవత్సరం నుండి రాష్ట్రాలకే స్వయం ప్రతిపత్తి విధానాన్ని కల్పించాలన్నారు. లక్షలాది మంది విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని, ఇప్పటికైనా మోడీ స్పందించి నీట్ ఎన్ టి ఏ మీద చర్చ పెట్టాల్సిందిగా, దోషులకు శిక్ష విధించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే కేంద్ర మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకోవడం జరుగుతుందన్నారు. ఈ సమస్యల్ని పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ను హెచ్చరించారు. బంద్ అనంతరం నిరసన తెలుపుతున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామ్యమైన చర్య అని ఖండించారు.విద్య సంస్థల బందుకు సహకరించిన ప్రైవేట్ విద్యాసంస్థల యజమాన్యాలకు, విద్యార్థులు,మేధావులకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శివాజీ, రాజు తదితరులు పాల్గొన్నారు.
