ఆమె పని తీరును బేష్ అంటున్న పట్టణ ప్రజలు
ద్రోణ కామారెడ్డి జూలై 4
కామారెడ్డి పట్టణంలో సమస్యలను పరిష్కరించే దిశలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎందుకు ప్రియా ప్రతినిత్యం ఒక అడుగు ముందుకు వేస్తూ పట్టణ ప్రజలను ఆకర్షించుకుంటున్నారు. పట్టణంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని ప్రజలు ఎంతోమంది మునిసిపల్ పరిస్థితి తీసుకువెళుతున్నారు. ఆరోపణలు వచ్చిన వెంటనే స్పందిస్తూ ఆమె సమస్య ఉన్న ప్రదేశాలను వెంటనే పరిశీలిస్తున్నారు. ఆ సమస్యల పరిష్కారానికి అధికారులకు సూచనలు చేస్తున్నారు. అనతి కాలములోనే కామారెడ్డి పట్టణ ప్రజల మన్ననలు ఆమె పొందారు. కామారెడ్డిలో ప్రతిరోజు ఆమె ఏదో ఒక ప్రదేశంతో దర్శనమిస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రి ముందు ట్రాఫిక్ సమస్యను పరిష్కారం చేసేందుకు ముందుకు వచ్చిన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి.
కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి ముందు గల ఉన్న రోడ్డు పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ, ఒకటే యూటర్న్ ఉండడంవల్ల అంబులెన్స్ కి మరియు ద్విచక్ర వాహనాలదారులకు ఇబ్బంది అవుతున్నందున ట్రాఫిక్ సమస్యను తలెత్తకుండా చూడాలని పోలీస్ వారికి చర్యలు తీసుకోవాలని మరియు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అలాగే స్పీడ్ బ్రేకర్ మరియు ప్లాన్ తో బారిగేట్ వేయిస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ ఇందు ప్రియా గారు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ సుజాత,సీఐ చంద్రశేఖర్ రెడ్డి,కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లు,లక్ష్మీనారాయణ, పాత శివ కృష్ణమూర్తి, అంజల్ రెడ్డి, చాట్ల వంశీకృష్ణ, కోయల్కర్ కన్నయ్య, మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
