Wednesday, February 25, 2026

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ

పలు అంశాలపై సుమారు 30 నిమిషాలు పాటు చర్చలు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిల్లీ పర్యటన కొనసాగుతోంది

పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన సమావేశమయ్యారు

రాష్ట్రానికి ఆర్థికసాయం, ఇతర అంశాలపై ప్రధానితో చర్చించారు

ద్రోణ న్యూఢిల్లీ ప్రతినిధి

దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ నెల చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న వేళ రాష్ట్ర అవసరాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసిన సీఎం హోంమంత్రి, ఆర్థికమంత్రి సహా పలువురు అమాత్యులతో భేటీ అయ్యారు.కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం కోరడమే అజెండాగా దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఆర్థికసాయం సహా రాష్ట్ర పునర్‌ నిర్మాణానికి అవసరమైన సహకారంపై చర్చించారు. గత ప్రభుత్వ విధ్వంసంతో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధానమంత్రికి నివేదించారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఆర్థికసాయం కోరారు. మౌలిక వసతుల కల్పన, అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తిచేయడానికి తోడ్పాటు అదించాలన్నారు. అనంతపురం – అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం, కీలక రహదారుల మరమ్మతులు, పట్టణ, గ్రామీణ పేదల ఇళ్లు, జల్‌జీవన్‌ మిషన్‌ కింద ఇంటింటికీ తాగునీటి సరఫరా వంటి ముఖ్యమైన అంశాలపై ప్రధానమంత్రి ముందుచ్చారు.

ప్రధానితో సమావేశానికి ముందు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. చంద్రబాబు సహా కేంద్రమంత్రులు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర ఎంపీలు, సీఎస్ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, ఇతర ఉన్నతాధికారులకు పీయూష్ గోయల్‌ అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి అవసరమైన సహకారంపై పీయూష్‌తో చర్చించారు.ఎంపీ అప్పలనాయుడిని అభినందించిన చంద్రబాబు*
విజయనగరం కలిశెట్టి ఎంపీ అప్పలనాయుడిని చంద్రబాబు అభినందించారు. లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణానికి పార్లమెంటుకు సైకిల్‌పై అప్పలనాయుడు వెళ్లారు. నితిన్ గడ్కరీని కలిసి బయటికొచ్చాక చంద్రబాబుకు మంత్రులు చెప్పారు. అప్పలనాయుడిని పిలిచి చంద్రబాబు అభినందించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించారని ఎంపీతో సీఎం అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular