కలం నిఘా :న్యూస్ రిపోర్టర్
ద్రోణ అసోం :జులై 04
అసోంలో వరద తాకిడి కొనసాగుతున్నది. మోరి గావ్ జిల్లాలో వరద బీభత్సానికి వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
అసోం జిల్లాల్లో ఏకంగా 194 గ్రామాలు నీటమునిగాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఒక్కసారిగా ఒక రోజులోనే అనూహ్యంగా వరద నీరు పోటెత్తిందని స్ధానికులు పేర్కొన్నారు. కుండపోత వర్షాలతో నిరాశ్రయులైన వారు తలదాచుకునేందుకు టెంట్లు, షెల్టర్స్, తాగునీరు, ఆహారం ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారు.
బ్రహ్మపుత్ర వరదలతో స్ధానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది.
