ద్రోణ జోగులాంబ గద్వాల
కారు దిగేందుకు సిద్ధమైన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
అనుచరులతో వెల్లడి ఈనెల 6 లేదా 9న హస్తం గూటికి
మా నిజకవర్గ ప్రజలు బాగుండాలంటే పార్టీ మారక తప్పదు
కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ పాలమూరు సక్సెస్ అవుతోంది.త్వరలోనే భారాసలోని ఆ సీనియర్ ఎమ్మెల్యే కారు దిగిందికి సిద్ధమయ్యారు. కొన్నాళ్లుగా సాగుతున్న ప్రచారానికి తన అనుచరులతో సమావేశమై క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 6న లేదా 9న కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ లో రెండు నిజకవర్గాలలో అసెంబ్లీ ఎన్నికల్లో భారాస విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే . ఒకటి గద్వాల్, మరొకటి అలంపూర్. ఆ ఇద్దరి లో ఇప్పుడు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. బుధవారం నాడు నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు,ముఖ్య అనుచరులతో సమావేశం కాగా..అందరూ కాంగ్రెస్ లోకి వెళ్లాలని సూచించారని, మన నిజ వర్గం అభివృద్ధి కావాలంటే పార్టీ మారక తప్పడం లేదని ఎమ్మెల్యే వర్గాలు కూడా చెప్పుకొస్తున్నాయి.
వరుస ఓటములతో జిల్లాపై పట్టుకు ప్రయత్నాలు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది. అందులో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకే జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. భారాసకు ఇద్దరే ఉన్నారు. కానీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవి చూసింది. ఆ తర్వాత జరిగిన పార్ల మెంట్ ఎన్నికల్లో బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. దీంతో సీఎం పాలమూరు జిల్లాపై పూర్తి పట్టుకు ఆపరేషన్ ఆకర్షకు తెరలేపారని హస్తం వర్గాలు వెల్లడిస్తూ వచ్చాయి. గద్వాల ఎమ్మెల్యేతో సంప్రదింపులు చేయడం ఆయన కొద్ది రోజులుగా నాన్చుతూ చివరికి కారు దిగడానికి సిద్ధమైయ్యారు. మరోవైపు మాత్రం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి రాకను స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు వెల్లడిస్తున్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారని, ఆయన రాకను ఎవరూ ఒప్పుకోవడం లేదని గద్వాల నియోజకవర్గ ఇంఛార్జ్ సరితా తిరుపతయ్య అన్నారు. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి వచ్చేందుకు కొంత మంది ఆసక్తి చూపిస్తారని ఎద్దేవా చేశారు.
ముమ్మాటికి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది.
