కాంగ్రెస్ లోకి ఆరుగురు బీఆరెస్ ఎమ్మెల్సీలు.
ద్రోణ హైదరాబాద్
గులాబీ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. పదేళ్లపాటు రాజు తలచుకుంటే దెబ్బలకు ఏం కొదవ అన్న చందంగా తెలంగాణ రాష్ట్రంలో తమ పాలన ను గులాబీ బాస్ కొనసాగించారు. ఆనాడు గులాబీ బాస్ చేసిన రాజకీయ ఎత్తుగడలను మళ్లీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే పందాలో గులాబీ పార్టీని బొంద పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా కాంగ్రెస్ గూటికి చేరారు. పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ భారీ పరాభావం చవి చూసింది. భవిష్యత్తులో కూడా ఆ పార్టీకి ప్రజల ఆదరణ ఉండదేమోనని ఆలోచనలో ప్రజా ప్రతినిధులు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆరెస్ ఎమ్మెల్సీలు దండె విఠల్, భానుప్రసాద్ రావు, ఎం.ఎస్.ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీలు.
జూబ్లీహిల్స్ నివాసంలో కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ.
