ద్రోణ హైదరాబాద్
తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఉపిరి పోయడానికి అధినేత చంద్రబాబు సిద్ధం అయ్యారు. జూలై 7వ తేదీన పార్టీ కార్యాలయం లో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీడీపీ కనుమరుగు అయింది అనుకుంటున్న తరుణంలో గత సంవత్సరం ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అనూహ్య స్పందన లభించింది. తెలంగాణ లో మూడవ సారి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో టిడీపీ పోటీ కి సిద్ధం అవుతున్న సందర్భం లో చంద్ర బాబు ను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అరెస్టు చేయడం పార్టీకి తెలంగాణలో తీవ్ర విఘాతం కలిగింది. అటువంటి సమయం లో కార్యకర్తలు పూర్తిగా పార్టీ అధినేతకు అండగా నిలిచారు. రాజకీయ పరిణామాలు దృష్ట్యా చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ కి మద్దతు తెలపవలిసి వచ్చింది. శాసన సభ ఎన్నికలలో పోటీ నుంచి పూర్తి గా విరమించాల్సిన పరిస్థితి నెలకొంది.దీనితో అధికారం లేక పోయినా రెండు దశాబ్దాల పాటు పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లో చేరవలిసి వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి కూటమి అధికారం లోకి రావడం తో తెలంగాణ లో కూడా పార్టీకి పునరుత్తేజం తీసుకు రావడానికి పార్టీ నాయకులు చంద్రబాబు తో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం పార్టీకి తాత్కాలిక అధ్యక్షుడిగా బక్కని నర్సింలు ఉన్నారు. పూర్తి స్థాయిలో అధ్యక్షుడి నియామకం జిల్లాల వారి ఇంచార్జుల నియామకం వంటి అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయం గా ఎదిగిన వారు బి ఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ కార్యాలయం లో చంద్రబాబు సమావేశం తో పార్టీ భవిష్యత్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
