Wednesday, February 25, 2026

పదవులు శాశ్వతం కాదు ప్రజా సేవే ముఖ్యం

పదవులు శాశ్వతం కాదని ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవలను అందించి ప్రజల్లో ఆదరణను పెంచుకునే లక్ష్యం దిశగా నడుచుకోవాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్క ర్ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పరిషత్ చివరి సమావేశం లో జహీరాబాద్ ఎంపీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ఐదేళ్లపాటు ప్రజలకు మీరు అందించిన సేవలను ప్రజలు మరువారని భవిష్యత్తులో ప్రజాసేవకే ప్రజాప్రతినిధులు అంకితం కావాలని ఎంపీ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మంజుల జైపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశం జహీరాబాద్ ఎంపీ సురేష్ షేట్కార్ పాల్గొని మాట్లాడుతూ పదవులు శాశ్వతం కాదు అనీ ప్రజ సేవ ముఖ్యం అనీ తెలిపారు.పదివి వీడ్కోలు పలుకుతున్న చైర్మన్, వైస్ చైర్మన్, జడ్పీటీసీ, ఎంపీపీ లకు అభినందనలు తెలిపారు.
ఎంపీ గెలుపొందిన తొలి సరి జిల్లా పరిషత్ సమావేశం కు రావడంతో సురేష్ షేట్కార్ కి జిల్లా పరిషత్ చైర్మన్ మంజుల జైపాల్ రెడ్డి శాలువా తో సన్మానించి ఘన స్వాగతం పలికారు.సమావేశం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజానర్సింహా , మెదక్ ఎంపీ రఘునాధన్ , నారాయణాఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యం, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, కలెక్టర్ వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular