ద్రోణ బోధన్ జులై 5
బోధన్ పట్టణంలోని ఆచనపల్లిలో అప్నా ఫంక్షన్ హాల్ సమీపంలో శుక్రవారం ఉదయం ఆక్యు ప్రెషర్ మ్యాగ్నెటిక్ మరియు వైబ్రేషన్ చికిత్స శిబిరము ఉదయం 9 గంటలకు లయన్ ఇంటర్ నేషనల్ 320 డి ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ లక్ష్మీ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని వినాయక నగర్ కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మరియు సెక్రెటరీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ వినాయక్ నగర్ కాలనీలో ఉన్న ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అనంతరం సాయంత్రం నాలుగు గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. చికిత్స కొరకు నామమాత్రం 200 రూపాయలు రిజిస్ట్రేషన్ ఉంటుంది కనీసం వారం రోజులు ఈ చికిత్స విధానాన్ని పాటిస్తే మోకాళ్ళ నొప్పులు మెడ నొప్పి సయాటికా తదితర ప్రాబ్లంలు పోతాయని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు కార్యక్రమంలో లయన్స్ గణపతి రెడ్డి, సత్యం, లక్ష్మి కాంత్ రెడ్డి,శ్రీనివాసరాజు, చక్రవర్తి కాలనీ సభ్యులు ఆర్మీ సాయిలు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ బసవేశ్వర రావు మాట్లాడుతూ ఈ చికిత్స ద్వారా రక్తపోటు తలనొప్పి నిద్రలేమి వాటిని కూడా తగ్గించుకోవచ్చనీ వివరించారు.
