ద్రోణ హైదరాబాద్
బీఆర్ఎస్ హయాంలో రూపొందించి, అమలు చేసిన ఇసుక తవ్వకాల విధానమే అక్రమాల పుట్ట అని రాజ్యంగ బద్ద సంస్థ అయిన కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది.*ఇసుక తవ్వకాల కాంట్రాక్ట్ మొదలుకొని ఇసుక రవాణా వరకు అన్నిట్లో అక్రమాలే అని కాగ్ నివేదించింది? మర్చిపోయారా?
2016 నుంచి 2021 వరకు మీరు చేసిన ఇసుక అక్రమ వ్యాపారాన్ని కాగ్ బట్టబయలు చేసింది. ఆ నివేదికను మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టాం.
ఒక్కటా రెండా అన్ని అక్రమాలే అని కాగ్ చెప్పింది
పేరుకే గిరిజన సంఘాలకు ఇసుక తవ్వకాల కాంట్రాక్టు ఇచ్చారని కానీ నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకు కాంట్రాక్టులు బదలాయించారని కాగ్ మొట్టికాయలు వేసింది.*
ఇసుక స్టాక్ విషయంలో స్టాక్ రిజిస్టర్ మైంటైన్ చేయలేదు. స్టాక్ బ్యాలెన్స్ లెక్కలు లేవని మీ పనితీరును కాగ్ తప్పు బట్టింది.ఇసుక రీచ్ లు, డంప్ యార్డుల వద్ద సీసీ కెమెరాలు లేవు. అధిక లోడ్‌లు వేసి దందా చేశారు.
ఇసుక రవాణా వాహనాలకు జీపీఎస్ లేదు
అనుమతులకు మించి ఇసుక తవ్వకాలు జరిగాయని కాగ్ తిట్టినా మీకు బుద్ది రాలేదు
అనుమతులు లేకుండా అధిక ఇసుక తవ్వకం, అక్రమ రవాణా జరిగిందని కాగ్ మీ పాలన గురించి మాహ గొప్పగా చెప్పింది.డిస్ప్యాచ్ అనుమతులు లేకుండానే ఇసుక అక్రమ రవాణా చేశారని కాగ్ క్షేత్రస్థాయి పరిశీలనలో తేట తెల్లం అయ్యింది.
సర్కార్ కు చరణా
భారాసా కు భారానా అన్నట్లు దొంగ ఇసుక దందా చేసింది. టిఆర్ఎస్ పెద్దలే.
ఇసుకను వ్యాపార వస్థువుగా మార్చింది టిఆర్ఎస్.
మీ లూటీ ఆగే సరికి..మీ అక్రమ ఆదాయానికి గండి పడే సరికి మా మీద నిరాధార ఆరోపనలు చేస్తున్నారు. మేము నిబంధనలు మార్చామా? కాంట్రాక్టర్లను మార్చామా?
ఇసుక అక్రమ రవాణాను ఆపమని అడిగిన పాపానికి సిరిసిల్ల నియోజకవర్గంలోని నేరెళ్ల దళితులను ఎలా హింసించారో మీరు మర్చి పోయినా.. తెలంగాణ సమాజం మర్చిపోలేదు.*
అక్రమ ఇసుక వ్యాపారానికి అంబాసిడర్లు మీరే
ఇప్పుడు గత విధానమే అమల్లో వుంది. ఇసుక మైనింగ్ విధానాన్ని సమూలంగా మారుస్తాం.త్వరలో కొత్త చట్టం తీసుకొస్తాం అని సీఎం చెప్పారు. కొత్త పాలసీ తెస్తాం.ఇసుకాసురుల అంతు చూస్తాం.
