కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం, మిర్జాపూర్ గ్రామంలోని హనుమాన్ మందిరాన్ని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శనివారం ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినాన్ని పురస్కరించుకొని మీర్జాపూర్ హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్ఛారణతో ప్రత్యేక పూజలు జరిపి ఆశీర్వదించారు. అనతి కాలంలోనే ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజల ఆదరణను పొందగలిగారు. ప్రతినిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నారు. పేదవారి కష్టాలను తెలుసుకునేందుకు నేరుగా వారి నివాసాల వద్దకు వెళ్లడం ఒక్కో రోజు పేదల మధ్యలో ఉంటూ వారి సమస్యలు తెలుసుకొని రాత్రి అక్కడే గడుపుతున్నారు. గతంలో పాలకులు జుక్కల్ నియోజకవర్గాన్ని వెనుకబాటు గురి చేశారని నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయంగా ఆయన ప్రతినిత్యం అడుగుల ముందుకు వేస్తున్నారు.
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జన్మదినం
RELATED ARTICLES
