ద్రోణ హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను ఆత్మహత్యాయత్నం ఘటన… విషాదాంతమైంది. హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన…. తుదిశ్వాస విడిచారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి సహా నలుగురు కానిస్టేబుల్స్ … పనిలో సహకరించడపోవడమే కాకుండా…. కులం పేరుతో వేధించారని. ఆత్మహత్యాయత్నం అనంతరం ఎస్సై శ్రీను… ఓ వీడియోలో తన గోడు వెళ్లబోసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు.. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
