షాద్ నగర్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ పడిగల విజయ్ కుమార్
నేరాల అదుపుకు పూర్తిస్థాయిలో చర్యలు
ప్రజలకు నిరంతరం సేవలు అందించేందుకు అందుబాటులో ఉంటాం
ద్రోణ హైదరాబాద్
నిరంతరం శాంతిభద్రతల పరిరక్షణకు తనవంతు కృషి చేస్తానని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ పడగల విజయ్ కుమార్ తెలిపారు. ఇటీవల విధి నిర్వహణలో ఇక్కడ కొత్తగా చేరిన సిఐను మీడియా మర్యాదపూర్వకంగా పలకరించింది. ఆదివారం సిఐ విజయ్ కుమార్ ను కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తనది 2007 బ్యాచ్ అని పేర్కొన్నారు. తెలంగాణలోని శంషాబాద్ ఆర్.జి.ఐ, ఈఓడబ్లూ, రాయదుర్గం మాదాపూర్, నేరెడ్ మెట్, వెల్దండ, నల్గొండ జిల్లా తిప్పర్తి, అదేవిధంగా సైబరాబాద్ లో స్పెషల్ బ్రాంచ్ (ఎస్.బి) ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించినట్టు మీడియాకు తెలిపారు. శాంతిభద్రతల విషయంలో ప్రజలు ఎల్లవేళల తనను కలుసుకోవచ్చని సూచించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని ఇక్కడి నేరాలు పరిస్థితి ఇతర అంశాలను మీడియాను అడిగి తెలుసుకున్నారు. పోలీసు శాఖకు మీడియా సహకారం ఎల్లవేళలా అందించాలని అప్పుడే సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవడం సాధ్యపడుతుందని అన్నారు. ముఖ్యంగా ఈవ్ టీజింగ్, పలు ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు, అసాంఘిక కార్యకలాపాలపై గట్టి నిఘా ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. పట్టణంలో రాత్రి వేళలో దొంగతనాలు జరగకుండా ప్రత్యేక గస్తీ, పెట్రోలింగుని ఏర్పాటు చేస్తామని చెప్పారు. పట్టణ శివారులో ఉన్న కొత్త కాలనీలలో కూడా పెట్రోలింగ్ ముమ్మరం చేస్తామని పేర్కొన్నారు. నేరాలకు సంబంధించిన విషయాలు ఏమైనా తెలిస్తే ప్రజలు నేరుగా తనను కలిసి చెప్పవచ్చని లేదా పోలీసు స్టేషన్ కు ఫోన్ చేసి వివరాలు చెప్పవచ్చని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిత్యం పోలీసులు కృషి చేస్తారని చెప్పారు. హైవే రోడ్డులో వ్యభిచారం, హిజ్రాల ఒత్తిడి, పట్టణములో బలవంతపు వసూళ్లు, మెయిన్ రోడ్డులో ఎక్స్ రోడ్డు నుండి ఏసీపి కార్యాలయం వరకు ట్రాఫిక్ సమస్యలు తదితర అంశాలపై చర్యలు తీసుకుంటానని అన్నారు. మిగతా ప్రాంతాలలో పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ ఇక్కడ కొంత పరిస్థితులు ఆకలింపు చేసుకుని ముందుకు సాగుతానని ఈ సందర్భంగా మీడియాకు సిఐ తెలిపారు.
తండ్రి మాణిక్యం షాద్ నగర్ లో రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా.
షాద్ నగర్ పట్టణ సిఐ పడిగల ఆనంద్ కుమార్ తండ్రి దివంగత పడిగల మాణిక్యం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించినట్టు గుర్తు చేసుకున్నారు. 1972లో తన తండ్రి మాణిక్యం ఇక్కడ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పని చేశారని, ఇప్పుడు ఇదే పట్టణములో తాను సీఐగా పనిచేస్తున్నట్టు సంతోషం వ్యక్తం చేశారు.
