Thursday, February 26, 2026

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు స్పష్టం చేశారు. జుక్కల్ నియోజకవర్గం ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ది దారులకు ఎమ్మెల్యే అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చి తీరుతుందని ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గత ప్రభుత్వం నియోజకవర్గం పట్ల పూర్తి నిర్లక్ష్యం చేసిందని, డబల్ బెడ్ రూమ్ పేరిట ఆనాటి పాలకులు ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలకు లబ్ధిదారులకు అనుమతులు ఇస్తామన్నారు. వచ్చేనెల 15 లోపు రైతు రుణాలు మాఫీ చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రతినిత్యం ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండడం పట్ల జుక్కల్ నియోజకవర్గ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పలువురు కాంగ్రెస్ లో చేరిక

జుక్కల్ నియోజకవర్గంలోని పెద్ద కొడపుగల్ మండలం పోచారం గ్రామానికి చెందిన పలువురు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజలకు సేవలు చేసేందుకు ముందుకొచ్చే వారిని ఎవరినైనా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు తాము స్వాగతం ఇస్తామన్నారు. పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి ఎమ్మెల్యే స్వాగతించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular