పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలపై లేని ఆరోపణలు, కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలకు తెరలేపే ప్రయత్నం చేస్తున్నారని, ఇటువంటి ప్రయత్నాలకు పోచారం పాల్పడితే సహించేది లేదని రాష్ట్ర ఎంపీటీసీల మాజీ అధ్యక్షులు ఎలమంచిలి శ్రీనివాసరావు హెచ్చరించారు.
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలంలో మాజీ ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ఎలమంచిలి శ్రీనివాసరావు కాంగ్రెస్ కార్యకర్తలతో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన స్థాయిని మరిచి కాంగ్రెస్ పార్టీ లో గ్రూపు రాజకీయ తగాదాలు సృష్టించేలా విమర్శలకు దిగుతున్నారని వర్ని మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.సిఎం రేవంత్ రెడ్డి పోచారం ను ఆహ్వానించిన,పోచారం సిఎం ను ఆహ్వానించిన పార్టీ విలువలకు కట్టుబడి ఉండకుండా పోచారం పార్టీకి నష్టం కలిగించేలా పత్రిక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు.బీ ఆర్ఎస్ పార్టీలో పదేళ్ల పాటు పలు కీలక పదవులు అనుభవించిన పోచారం మాజీ సిఎం కేసిఆర్ కు వెన్నుపోటు పొడిచి నియోజక వర్గ కాంగ్రెస్ నాయకుడు కాసుల బాలరాజు ను స్కూటర్లు, మోటార్ సైకిల్ దొంగగా చిత్రీకరించి సీఎం రేవంత్ రెడ్డి ని హైదరాబాదులో రియల్ ఎస్టేట్ చేసి భూకబ్జాలు చేస్తున్నాడని వారిని చూసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు భయపడుతున్నారని చెప్పిన పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కి ఎన్ని భూకబ్జాలు చేద్దామని వచ్చాడని ఎద్దేవా చేశారు.ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరి అదే బాలరాజును అక్కున చేర్చుకోవడం హాస్య స్పదమని విమర్శించారు సంస్కార్ భూముల విషయంలోనూ తనపై నిరాధార ఆరోపణలు చేశారని ఈ విధానంతో ప్రజలు సైతం పోచారం వైఖరి పై నవ్వుకుంటున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోచారం మూడో స్థానానికి దిగజారరని కాంగ్రెస్ పార్టీ మాత్రం నియోజకవర్గంలో మొదటి స్థానంలో ఉందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని అనుచిత వ్యాఖ్యలు గ్రూప్ తగాదాలు లేవనెత్తితే కాంగ్రెస్ కార్యకర్తలు సహించరని హెచ్చరించారు. తన సహచరులకు భూ కబ్జాలు చేయించిన ఘనత పోచారంది కాదా అని ప్రశ్నించారు. ఏఐసిసీ ఆదేశాలతో నియోజక వర్గ ఇంఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు అన్ని ఎన్నికల్లో సముచిత గౌరవం లభిస్తుందని భరోసా ఇచ్చారు. కొంతమంది ఫోటోల రాజకీయం చేస్తున్నారని వారి బుద్ది మారి ప్రజల్లో ఉండాలని చెపుతు ఇకనుంచి పోచారం శ్రీనివాసరెడ్డి తప్పుడు ఆరోపణలకు దిగితే తమ పార్టీ నాయకత్వం చూస్తూ ఊరుకునేది లేదనీ హెచ్చరించారు.ఈ సమావేశంలో సీనియర్ నాయకులు కులకర్ణి సురేష్ , భజ్య నాయక్,రెడ్డి రాంబాబు,గంగప్పా,దశరథ్, ప్రసాద్,రమేష్ రాథోడ్, వకీల్ ఫారం రాంబాబు,కోనేరు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
పోచారం తప్పుడు ఆరోపణ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు
RELATED ARTICLES
