Thursday, February 26, 2026

స్థానిక ఎన్నికల్లో బిజెపి సత్తా చాటుదాం

మాజీ ఎంపీ బి బి పాటిల్

ఇదే స్ఫూర్తి తో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో అన్ని స్థానాలు గెలవాలనీ
మాజీ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీపాటిల్ పిలుపునిచ్చారు.

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు సంతృప్తినిచ్చాయి

నిస్వార్థంగా పని చేసి కామారెడ్డి లో 19 వేళ మెజారిటీ తెచ్చిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో అధికారం సాధించే దిశగా బీజేపీ అడుగులు.
జహీరాబాద్ పార్లమెంట్ ప్రభారి పెద్దోళ్ల గంగారెడ్డి.
జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సమీక్షా సమావేశాలలో భాగంగా కామారెడ్డి జిల్లా కార్యాలయంలో కామారెడ్డి అసెంబ్లీ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన మాజీ పాటిల్ మాట్లాడుతూ మోది కి మద్దతుగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కృషితో కామారెడ్డిలో బీజేపీ కి అత్యధికంగా ఓట్లు వచ్చాయని కానీ మిగితా చోట్ల ప్రజల్ని ఆకట్టుకోలేక పోయామని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గ కార్యకర్తలు ఇదే స్ఫూర్తి తో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవాలనీ ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన పెద్దోళ్ల గంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు సంతృప్తినిచ్చాయనీ, జహీరాబాద్ పార్లమెంట్ కూడా గెలుపు అంచుల్లో ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో నిస్వార్థంగా పని చేసి 19 వేళ మెజారిటీ తెచ్చిన కార్యకర్తలకు, వారికి నాయకత్వం వహించిన ఎమ్మెల్యే రమణ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో అధికారం సాధించే దిశగా బీజేపీ అడుగులు వేస్తుందని అందుకు కార్యకర్తలు ఇప్పటి నుండే సిద్ధం కావాలని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular