ద్రోణ హైదరాబాద్
రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్గా కాసుల బాలరాజ్ కు నియామక ఉత్తర్వులు రావడంతో సోమవారం ఎంపీ సురేష్ శెట్కార్ ను హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజును శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో ఎప్పుడు గుర్తింపు ఉంటుందని దానికి నిదర్శనమే కాసుల బాలరాజుకు కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, నగేష్ శెట్కార్, మాజీ జడ్పిటిసి ప్రదీప్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
