Thursday, February 26, 2026

బోధన్ రెవిన్యూ అధికారుల ఇష్టారాజ్యం

వందమంది రైతులు స్లాట్ బుక్ చేసిన రిజిస్ట్రేషన్ కు నో

కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న రైతులు

విధులకు అధికారులు గైర్హాజర్

చేతులు తడపందే ఫైల్ ముందుకు కదలదు

గగ్గోలు పెడుతున్న బోధన్ మండల ప్రజలు

బోధన్ మండలం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 100 మంది రైతులు భూములు అమ్మకాలు చేపట్టేందుకు స్లాట్ బుక్ చేసిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ రెవెన్యూ అధికారులు పూర్తి చేయడం లేదని ఈ ప్రాంత రైతాంగం గగ్గోలు పెడుతుంది. బోధన్ తాసిల్దార్ విధుల నిర్వహణలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు ఆరోపస్తున్నారు. స్లాట్ బుక్ చేసిన రైతుల భూముల రిజిస్ట్రేషన్లు చేయకపోవడం ఒక ఎత్తు అయితే మరోపక్క మీ సేవల వారు రైతుల స్లాట్ బుకింగ్ చేయవద్దని మౌఖికంగా ఆదేశాలు జారీ చేయడం.

ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. నెల రోజులు గా ఎంతో మంది రైతులు భూముల క్రయవిక్రయాలను జరిపేందుకు ధరణిలో స్లాట్ బుక్ చేసుకున్నారు. బోధన్ తాసిల్దార్ సోమవారం విధులకు గైరాజరయ్యారు. తాసిల్దార్ లేని సందర్భంలో కార్యాలయంలోని డిప్యూటీ తాసిల్దార్ కు రిజిస్ట్రేషన్ బాధ్యతలను అప్పగించాల్సి ఉంది.

సోమవారం ఎంతోమంది వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన వారు కార్యాలయం ఎదుట పడిగాపులు కాస్తున్నారు. ప్రజలు రెవెన్యూ అధికారుల పనితీరు పట్ల తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు నెలలుగా రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపణలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఎవరెన్ని ఆరోపణలు చేసిన రెవెన్యూ అధికారుల తీరులో మాత్రం మార్పు రావడంలేదని ఎంతోమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాహసిల్ కార్యాలయం కంటి పెట్టుకునే రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం ఉన్నప్పటికీ బోధన్ మండల రెవెన్యూ అధికారులు ఏమాత్రం ఆలోచన చేయకపోవడం

పట్ల ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఏ రాజ్ పల్లి గ్రామానికి చెందిన ఓ రైతు సుమారు నెల రోజుల నుండి తమ కుటుంబ సభ్యుల ఆస్తిని తమ పేర్లతో మార్పించేందుకు నిబంధనల మేరకు మీ సేవలో స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 10 రోజులపాటు తన వ్యవసాయ పనులను మానుకొని తాసిల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నామని అయినప్పటికీ రెవిన్యూ అధికారులు కనికరించడం లేదని రైతు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. వీరితో పాటు ఎన్నో గ్రామాల నుండి వచ్చిన ప్రజలు కార్యాలయం వద్ద తమ సమస్యల పరిష్కారం కోసం పడిగాపులు కాస్తున్నారు.

రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం తారాస్థాయికి చేరింది. శనివారం వరకు ఉప తాసిల్దార్ విధులకు గైరాజరయ్యారు. రెవెన్యూ అధికారులు బాధ్యతారహితంగా ప్రజలకు సమాధానాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం గత ప్రభుత్వం మండల తాసిల్దార్ కార్యాలయాల్లోనే భూముల అమ్మకాలు చేపట్టే వీలు కల్పించింది. ప్రజలకు సౌకర్యవంతం చేద్దామని ప్రభుత్వం ఆలోచన చేస్తే కొన్నిచోట్ల రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా చేయడం పట్ల ప్రభుత్వాల లక్ష్యం నీరు గారుతోంది. మరొ పక్క రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. స్లాట్ బుకింగ్ లో అన్ని వివరాలను మీసేవ ద్వారా అప్లోడ్ చేయడం జరుగుతుంది. పని జరిగే తారీకు సైతం తెలుపబడుతుంది. ఇటువంటి పకడ్బందీ ఏర్పాట్లను ప్రభుత్వం చేసినప్పటికీ రెవిన్యూ అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారుతుంది.

మామూళ్ల మత్తులో కంప్యూటర్ ఆపరేటర్లు

రెవిన్యూ కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్లు మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారు. రెవిన్యూ అధికారుల సైతం కంప్యూటర్ ఆపరేటర్లను మధ్యవర్తులుగా నియమించుకుని ప్రజల వద్ద నుండి డబ్బు గుంజుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పనులు కావాలంటే రైతులు కంప్యూటర్ ఆపరేటర్లను కలిసి చేయితపాల్సిందే. గతంలో పనిచేసిన ఆపరేటర్ ఎన్నో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో లక్షలాది రూపాయలు చేతివాటం ప్రదర్శించినట్లు ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కొన్ని ఆరోపణలు ఆధారాలతో రుజువు కావడంతో ఉన్నతాధికారులు కంప్యూటర్ ఆపరేటర్ నిజామాబాద్ బదిలీ చేశారు. మళ్లీ అదే ప్రక్రియ బోధన్ తాసిల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్లే మీ సేవల నిర్వాహకులకు ఫోన్లు చేసి రైతులు భూములమ్మకాలకు ఎవరొచ్చినా స్లాట్ బుక్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు. స్లాట్ బుకింగ్ నిలిపివేస్తే రైతులు తలలు బాదుకుంటున్నారు. కొంతమంది రైతులు ఇతర చోట్ల నుండి స్లాట్ బుక్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయని రైతులు వాపోతున్నారు. స్లాట్ బుక్ చేసుకొని చేతులు తడిపితేనే రిజిస్ట్రేషన్లు ప్రక్రియను పూర్తి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

అక్రమ ఇసుక రవాణా

బోధన్ మండలం మంజీరా సరిహద్దు ప్రాంతాల గ్రామాల నుండి ప్రతినిత్యం అక్రమ ఇసుక రవాణా యదేచ్చగా కొనసాగుతుంది. ఇసుక రావడం వల్ల గ్రామాల్లో గ్రూపు తగాదాలు ఎన్నో వివాదాలు ప్రజల్లో చోటు చేసుకుంటున్నాయి. ఎంతోమంది ఇసుక రవాణాను నిలుపుదల చేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నప్పటికీ అధికారుల తీరులో మాత్రం మార్పు కనిపించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి ఇప్పటికే ఎన్నో పర్యాయాలు ఆక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ రెవిన్యూ పోలీస్ అధికారులు ఎమ్మెల్యే మాటలను పెడచెవిన పెడుతున్నారు. ట్రాక్టర్ల యజమానుల నుండి అధికారులు నెల మామూలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే ఆదేశాల కన్నా అక్రమ రవాణా దారుల నుండి వచ్చే డబ్బే ముఖ్యంగా భావిస్తూ అధికారులు అక్రమ దారులకు వత్తాసు పలుకుతున్నారు.

మరోపక్క మొరం రవాణాలో కూడా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో అక్రమ మోరం రవాణా దారులు వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బోధన్ రెవెన్యూ అధికారులు డబ్బు ఇచ్చిన వారికే ప్రాధాన్యమిస్తూ, సామాన్య ప్రజలకు కనీసం మాట్లాడేందుకు కూడా నిరాకరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవిన్యూ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular