Thursday, February 26, 2026

రాఘవులు చిరస్మరణీయుడు

నిజాం షుగర్ రక్షణ కమిటీ కన్వీనర్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా గౌరవ అధ్యక్షుడు
ఉప్పునూతల రాఘవులు 5వ వర్థంతి సందర్భంగా బోధన్ పి ఆర్ టి యు భవన్ వద్ద రాఘవులు చిత్ర పటానికి పూల దండ వేసి ఘన నివాళులు అర్పించారు. రెండు నిముషాలు మౌనం పాటించి రాఘవులు ఆశయా సాధనకై ముందుకు సాగుతామని కార్యక్రమం లో పాల్గోన్న నాయకులు తెలిపారు. వామపక్ష పార్టీల నాయకులు, నిజాంషుగర్ ఫ్యాక్టరీ కార్మికులు, జర్నలిస్టులు, విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడపాలని, అక్రమ లే ఆఫ్ ఎత్తివేయాలని సుమారు నాలుగు సంవత్సరాలు బోధన్ కేంద్రం గా అలుపెరుగని పోరాటం నడిపిన వ్యక్తి రాఘవులు అని కోనియాడారు. బోధన్ ప్రాంత రైతాంగం గురించి, కార్మికుల గురించి నిరంతరం తపన పడే వాడని పేర్కోన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడిపితే బోధన్ ప్రాంతం అభివృద్ధి లో జిల్లా లో అగ్రభాగన ఉండేందని ఆశించాడని పోరాటాలు నడిపారని గుర్తు చేసుకున్నారు. నిరంతరం ప్రజల కోసం అలోచించే వ్యక్తులు సమాజంలో అరుదుగా ఉంటారని అందులో రాఘవులు అగ్రభాగన ఉంటారని తెలిపారు.

తెలంగాణ తోలి ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలను విస్మరిస్తుంటే ఆవేదన చెందారని, పోరాటలే సమస్యల పరిష్కారానికి మార్గం అని నమ్మి పోరు బాట లో చివరి దాకా నడిచిన చిరస్మరణీయుడు రాఘవులు అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ కన్వీనర్ గోపాల్ రెడ్డి, వామపక్ష పార్టీల నాయకులు పి వరదయ్య, మల్లేష్, గంగాధరప్ప, శంకర్ గౌడ్, ఏశాల గంగాధర్, సురేష్, కంజర భూమయ్య, సుధాకర్, వెంకటేశ్వర్లు, కార్మిక నాయకులు ఉపేందర్, రవి శంకర్ గౌడ్, శ్రీనివాస్, బాలకృష్ణ, మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు గడ్డం గంగులు, సీనియర్ జర్నలిస్టులు బలరామరాజు, నాగేశ్వరరావు, శ్రీనివాస్,వాసు, జగన్, రాజేష్, హైమద్ ,విద్యార్థి సంఘాల నాయకులు నాగరాజు, సంజయ్, రాజన్న, పడాల శంకర్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular