వర్షాకాలంలో పట్టణం, గ్రామాల్లో విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉండకూడా చూడాలి
గృహ జ్యోతి, మహా లక్ష్మి పథకాల అసలైన లబ్దిదారులకు లబ్ధి చేకూరేలా చూడాలి
గ్రామాల్లో చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి
విద్యుత్ మరియు ఇతర శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన
కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
ద్రోణ కామారెడ్డి ప్రతినిధి
కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ఉదయం విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది తదితర ఇంజనీర్లతో మరియు మధ్యాహ్నం ఎంపీడీవో లు, ఎంపీ ఓ లతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి విద్యుత్ అధికారులతో మాట్లాడుతూ విద్యుత్ అధికారులు బోరుబావుల వద్ద విద్యుత్ సరఫరా సమస్య తలెత్తకుండా చూడాలనీ, వర్షానికి ట్రాన్స్ఫార్మర్ లు ఇబ్బంది పెట్టినా తొందరగా మరమ్మత్తులు అయ్యేలా చూడాలని అన్నారు. వర్షాకాలంలో పట్టణం, గ్రామాల్లో విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉండకూడా చూడాలని అన్నారు. ఎంపీడీవో లతో మాట్లాడుతూ గృహ జ్యోతి, మహా లక్ష్మి పథకాల అసలైన లబ్దిదారులకు లబ్ధి చేకూరేలా చూడాలనీ జీరో కరెంట్ బిల్లు రాని లబ్దిదారులు ఎలక్ట్రిసిటీ, ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా చూడాలని అన్నారు. గ్రామానికి సంబంధించిన ట్రాక్టర్ల మెయిటేనెన్స్, ఇతర పనుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని సూచించారు.
