శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో వరుస ఉగ్రఘటనలు ఎదురవుతున్నాయి. సోమవారం భారత ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. కథువా జిల్లాలోని మాచేడి ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఇదిలా ఉంటే.. రాజౌరీ వద్ద మాఝకోట్ సైనిక శిబిరంపై ఆదివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ సైనికుడికి గాయాలయ్యాయి. సైనికులు ఎదురుకాల్పులు జరపడంతో చీకట్లో ఉగ్రవాదులు పరారయ్యారు. వీరిని పట్టుకోవడానికి సైన్యం గాలింపు చేపట్టింది.మరోపక్క కుల్గామ్ జిల్లాలో రెండు రోజులుగా రెండు గ్రామాల్లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్లలో ఆరుగురు మృతి చెందారు. శనివారం ప్రారంభమైన ఎన్‌కౌంటర్లలో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు.
RELATED ARTICLES
