ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని ఎన్ పి డి ఎస్ ఎల్ కు చెందిన సిఎల్ లకు బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఉద్యోగులు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఏనుగు కు అందజేశారు. సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన ఇంచార్జ్ కు ధన్యవాదాలు తెలిపారు.
