Thursday, February 26, 2026

రహదారి అభివృద్ధి తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం

రహదారులను అభివృద్ధి పరిస్తే ఆ ప్రాంతాల్లో భూముల విలువ రెట్టింపు కావడం, రవాణా సౌకర్యం మెరుగైతే ఆ ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలు పరిశ్రమలను ఏర్పాటు చేస్తారని, కాంగ్రెస్ ప్రభుత్వం రహదారులను తీర్చిదిద్ది రాష్ట్ర అభివృద్ధి ఏకైక లక్ష్యంతో ముందుకు వెళుతుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
మంగళవారం ములుగు జిల్లా కేంద్రం లో ములుగు నుండి పత్తిపల్లి వరకు వయా దేవగిరి పట్నం రోడ్డు పునరుద్ధరణ (రెన్యూవల్) రూ. 656.00 లక్షలతొ గిరిజన సంక్షేమ శాఖ రహదారి 5.5 కి.మిటర్లు పనులకు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అదనపు కలెక్టర్ పి.శ్రీజ లతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ డి. వీరభద్రమ్, ఏ ఈ ఈ ప్రణిత, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular