Thursday, February 26, 2026

మహబూబ్ నగర్ లో 400 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ జిల్లాలో వివిధ పనులకు గాను సుమారు 400 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు మంజూరు చేసినట్లు తెలిపారు. వీటిల్లో మంగళవారం 354 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఆయన చేతుల మీదుగా చేశారు.

ద్రోణ మహబూబ్ నగర్

తెలంగాణ రాష్ట్రంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ కలెక్టరేట్ ఆవరణలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మొక్క లు నాటారు. ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృ ద్ధి పనులకు సిఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 396.09 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగా రూ.353.66 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఎంవిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.10 కోట్లతో బాలికల హాస్టల్ నిర్మాణం, దేవరకద్రలో రూ.6.10కోట్ల తో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం, మహబూబ్ నగర్ రూరల్ లో రూ.3.25 కోట్లతో కెజివిబి భవన నిర్మాణనికి శంకుస్థాపన చేశారు.
దీనిలో భాగంగా గండీడ్ లో రూ.6.20 కోట్లతో కెజివిబి భవన నిర్మాణం, పాలమూ రు యూనివర్సిటీలో రూ.13.44 కోట్లతో టిపి, అకాడామిక్ బ్లాక్, గ్యాలరీ పనులు, మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో రూ.37. 87 కోట్లతో సిసి రోడ్లు, స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం, మహబూబ్ నగర్ మున్సి పాలిటీలో రూ.276.80 కోట్లతో ఎస్ టిపి నిర్మాణా నికి శంకుస్థాపన చేశారు. పాలమూరు యూనివర్సి టీలో రూ.42.40 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్ర మానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సిం హ, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, చిన్నారెడ్డి, ఎంపి మల్లు రవి, ఎమ్మెల్యే లు, అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular