Thursday, February 26, 2026

బోధన్ మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం

మధ్యాహ్నం భోజన నిత్యవసర వస్తువులని ప్రభుత్వమే సప్లై చేయాలి. ఎండిఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోపునూరు చక్రపాణి మాట్లాడుతూ గత ఐదు నెలల నుండి బిల్లులు రాక మధ్యాహ్న భోజన కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి రావలసిన బకాయి డబ్బులను ఇప్పిస్తే దుకాణదారులు మళ్లీ వారికి కావలసిన నిత్యవసర వస్తువులను తీసుకునే అవకాశం ఉంటుందని వారి దగ్గర ఉన్న వస్తువులను తాకట్టు పెట్టిన వస్తువులను తెచ్చుకుంటారని అన్నారు. అన్ని పిల్లలకు సరిగా పెట్టాలని ఏ విధంగా అయితే చెబుతున్నారో అదే విధంగా నెలసరి వేతనాలను కూడా ఇవ్వాలని గుడ్లు, రాగి జావా ఇలాంటివి పెట్టలేకపోవడం కార్మికులే అని చెప్పడం సరికాదు వారికి పూర్తిస్థాయిలో నిత్యవసర వస్తువులు గ్యాస్ అన్ని ప్రభుత్వమే సిద్ధం చేయాలని అదేవిధంగా ప్రభుత్వం గత సంవత్సరం ఇచ్చిన మాట ప్రకారం 10000 వేతనం ఇవ్వాలని ఈ ఎస్ఐ, పి ఎఫ్ సౌకర్యం కూడా వారికి కల్పించాలని కార్మికులను గుర్తించి ప్రభుత్వానికి సత్యసాయి సమితికి 1:25పై ప్రభుత్వం ప్రతినెలా ఇస్తుంది. మాకు రాగి జావా చేసినందుకు ఏమీ కూడా ఇవ్వడం లేదు రాజకీయ జావాకు రెండు రూపాయలు స్లాబ్ రేటు సప్లై చేయాలని కోరుతున్నారు లేనిపక్షంలో రాబోయే కాలంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మీరు హెచ్చరిస్తారని అనుకుంటున్నామని అన్నారు.

ఈ సమావేశంలో మండల అధ్యక్షురాలు రూప, శ్యామ్ రావు, లక్ష్మీ, తదితర కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular