Thursday, February 26, 2026

హైదరాబాద్‌లో కాల్పుల కలకలం

ద్రోణ. హైదరాబాద్‌

భాగ్యనగరంలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. రైల్వేస్టేషన్ దగ్గర ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని పోలీసులు ప్రశ్నించారు. సమాధానం చెప్పని ఆ ముగ్గురు దుండగులు క్షణాల్లోనే పోలీసులపై మెరుపు దాడికి యత్నించి పారిపోవాలని చూశారు.

కాల్పులు ఎందుకు..?

ఒకరు గొడ్డలితో.. మరో ఇద్దరు రాళ్లతో పోలీసులపై దాడికి యత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులు కాల్పులు జరిపి దుండగులను పట్టుకున్నారు. ఈ కాల్పులతో హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పట్టుబడ్డ వారిలో అనీస్ రాజ్‌తో పాటు మరో ఇద్దరు నిందితులున్నారు. పోలీసుల కాల్పుల్లో ఒకరికి గాయాలవ్వగా.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ ముగ్గురినీ దోపిడీ దొంగల ముఠాగా పోలీస్ డెకాయ్ టీమ్ అనుమానిస్తోంది.

మేమున్నాం..!

ఇదిలా ఉంటే.. ఇటీవలే హైదరాబాద్‌ శివారులో దోపిడీ దొంగలను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇప్పుడు నాంపల్లి స్టేషన్ దగ్గర మరోసారి కాల్పులు జరిగాయి. ఈ వరుస ఘటనలతో హైదరాబాద్ ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్న పరిస్థితి. అయితే.. శాంతి భద్రతలు, రక్షణ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని నగరవాసులు ప్రశాంతంగా ఉండొచ్చని పోలీసులు అభయమిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular