Thursday, February 26, 2026

బీఆర్ఎస్ తో తెలంగాణ దీవాళ

ద్రోణ బిచ్కుంద

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం వాజిద్ నగర్ గ్రామంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు దంపతులు.
సమావేశానికి హాజరయ్యారు. ఎమ్మెల్యే దంపతులను గ్రామస్థులు ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయిస్తే నేడు ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హంగులు ఆర్భాటాలకు పోకుండా , అనవసరపు ఖర్చులు తగ్గిస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ వ్యవస్థలను గాడిలో పెడుతున్నారన్నారు.
అదేవిధంగా తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పారు.పార్టీలో చేరికల పట్ల కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతీ ఒక్కరికీ తగిన ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు.గ్రామ మాజీ సర్పంచ్ తోట అనసూయ నారాయణ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వారితో పాటు గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా చేరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular