ఏపీ సీఎం చంద్రబాబు హితవు
ద్రోణ అమరావతి ప్రతినిధి
సీఎం చంద్రబాబు ఆ పార్టీ కార్యకర్తలకు కీలక పిలుపునిచ్చారు.అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడుతూ
‘కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని వీడాలి.
ఎవరైనా నా కాళ్లకు దండం పెడితే.నేనూ వారి కాళ్లకు దండం పెడతా. ఈ రోజు నుంచి నా కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నా.
తల్లిదండ్రులు, భగవంతుడికి తప్ప నాయకుల కాళ్లకు దండం పెట్టకూడదు.’ అని అన్నారు.
ఈ మేరకు కార్యకర్తలు, ప్రజల నుంచి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు.
