ద్రోణ కోటగిరి
ప్రభుత్వం నిబంధనలు ఎంత కఠిన తరం చేసిన అన్నతి కాలంలో రైస్ మిల్లర్లు కోట్లకు పడగలెత్తాలన్న అత్యాశతో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి వాటినే రీ సైక్లింగ్ చేసి అవే బియ్యాన్ని సివిల్ సప్లై కి సరఫరా చేస్తూ అలవాటు పడి ఉన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని రైస్ మిల్ యాజమాని మహారాష్ట్ర నుండి రేషన్ బియ్యాన్ని తన రైస్ మిల్ కు దిగుమతి చేసుకునే సమయంలో అధికారులు పట్టుకున్నారు. డిటి ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి నిఖిల్ రాజ్, కోటగిరి ఎస్సై వారి బృందాలతో చాకచక్యంగా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని పట్టుకుని సీజ్ చేశారు.
