Friday, February 27, 2026

సాలూరలో శ్రమదానం

ద్రోణ బోధన్

నిజాంబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని
సాలూర గ్రామంలోని అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం(లైబ్రరీ) వద్ద శనివారం శ్రమదాన కార్యక్రమం చేపట్టారు. లైబ్రరీ అభివృద్ది కమిటీ ప్రతినిధులు
స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా లైబ్రరీ పరిసరాలలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. అలాగే దోమలు వృద్ది చెందకుండా పూర్తిగా పిచ్చి మొక్కలు తొలగించారు. ఈ సంధర్బంగ లైబ్రరీ అభివృద్ది కమిటి అధ్యక్షులు స్వామిగౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలం సందర్భంగా లైబ్రరీ పరిసర ప్రాంతంలో పిచ్చి గడ్డి పెరిగి ఇబ్బందిగా మారిందని, దాంతో పిచ్చి గడ్డిని తొలగించినట్లు తెలిపారు. దోమలు పెరిగి సీజనల్ వ్యాధులకు కారణమవుతాయనే కారణంతో నేడు లైబ్రరీ సభ్యుల ఆధ్వర్యంలో శుభ్రం చేయడం జరిగిందని తెలిపారు. ప్రతినెల ఇదేవిధంగా స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపడతామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో లైబ్రరీ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి లింబూరి లక్ష్మణ్ , ముఖ్య సలహాదారులు సింగడి పాండు, బొర్ర గంగారం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular