ద్రోణ హైదరాబాద్ :జులై 13
టీ,జి ఆర్ టి సి,లో బస్ టికెట్లను తన ప్లాట్ఫామ్ ద్వారా విక్రయించేందుకు వాట్సాప్ యోచిస్తోంది.
ఇప్పటికే ఈ విషయంపై చర్చలు జరుపుతున్నామని వాట్సాప్ బిజినెస్ ఇండియా హెడ్ రవి గార్గ్ వెల్లడించారు.
ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ట్రైన్ టికెట్లు వాట్సాప్‌లో బుక్ చేసుకునే వీలున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే యూపీఐ ద్వారా బస్సుల్లో టికెట్లు విక్రయించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది.
