Sunday, May 17, 2026

భార్య భర్తలు మృతి

ద్రోణ అనంతపురం

అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హవళిగి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొత్తగా నిర్మించిన ఇంటి పై కప్పు కూలిపోవడంతో ఇంట్లో నిద్రిస్తున్న దంపతులిద్దరూ మృతి చెందారు.వారి పక్కనే నిద్రిస్తున్న వారి కుమార్తె మానస, మృతురాలి తమ్ముడు రాముకి గాయాలయ్యాయి. బయట నిద్రిస్తున్న కుమారుడు సురక్షితంగా ఉన్నాడు. మారెప్ప(49) లక్ష్మి(45) దంపతులిద్దరూ ఈ ఘటనలో మృతి చెందారు. మారప్ప గ్రామంలో నూతన ఇంటిని నిర్మిచుకున్నారు.

తెల్లవారితే గృహప్రవేశం

రాత్రి కురిసిన చిన్నపాటి వర్షానికి పూర్తిగా తడిసిన ఇంటి పైకప్పు వారు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
దంపతులిద్దరూ ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular