Wednesday, February 18, 2026

కమిషనరేట్ లో డ్రగ్స్ కంట్రోల్ టీం

వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

ద్రోణ వరంగల్ ప్రతినిధి

మత్తు పదార్థాల నియంత్రణకై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ టీంను ఏర్పాటు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.
దేశ భవిష్యత్తు అయిన యువతతో పాటు విద్యార్థులను మత్తు పదార్థాల బారిన పడుకుండా అలాగే గంజాయి లాంటి మత్తుపదార్థాల అక్రమ రవాణాతో పాటు విక్రయాలకు పాల్పడుతున్న నేరగాళ్ళపై ఉక్కుపాదాన్ని మోపి తద్వారా కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకై పోలీస్ కమిషనర్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీం ఏర్పాటుకు కమిషనర్ నిర్ణయించారు. ఒక రిజర్వ్ ఇన్స్ స్పెక్టర్ల, ముగ్గురు ఆర్.ఎస్.ఐలు మరికొంత మంది పోలీస్ సిబ్బందితో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక విభాగం పోలీసులు ట్రై సిటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా యువత మత్తు పదార్థాలను సేవించేందుకు అనువైన ప్రదేశాలతో పాటు కాలేజీలు, గంజాయి విక్రయాలు జరిగే పాఠశాలల, ప్రధాన కూడళ్ళు, సినిమా టాకీస్ లు, షాపింగ్ మాల్స్ పై దృష్టి సారించడంతో ప్రధానంగా రాత్రి సమయాల్లో నగరంలో గంజాయి వినియోగించేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించడం జరుగుతుంది. ఇందు కోసం ఈ ప్రత్యేక విభాగం స్థానిక పోలీసులతో నిరంతరం గస్తీ కొనసాగించడంతో పాటు పోలీసులకు అందిన సమాచారంతో స్థానిక పోలీసులతో కల్సి గంజాయి సేవించే ప్రాంతాలపై మెరుపుదాడి చేసి గంజాయి ప్రియులను అదుపులోకి తీసుకోని తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని. అలాగే గంజాయి క్రయ విక్రయాలకు పాల్పడే వ్యక్తులపై కూడా ఈ విభాగం పోలీసులు ప్రత్యేక నజర్ వుంటుందిగా. ప్రధానంగా గంజాయి వినియోగంచే వ్యక్తులను కట్టడి చేయడం ద్వారా గంజాయి మత్తులో జరిగే నేరాలను అదుపు చేసేందుకు మరింత సులభమవుతుందని కమిషనర్ తెలిపారు. అలాగే ఈ మత్తు పదార్థాల నియంత్రణతో పాటు యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా అలాగే ఈ గంజాయి మహమ్మారి మీ ఇంటి దరి చేరకుండా మీ పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడకుండా ఉండాలంటే తల్లిదండ్రులతో పాటు ప్రతి పౌరుడు తనవంతు బాధ్యతగా మత్తు పదార్థాల నిర్మూలన కై ప్రజలు పరోక్షంగా గంజాయి నియంత్రణలో భాగస్వాములు కావలసిన అవసరం వుందని.ఇందుకోసం మత్తు పదార్థాలను, సేవిస్తున్న, విక్రయిస్తున్న, రవాణా చేస్తున్న 8712584473 నంబర్ కు సమాచారం అందించాలని. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గొప్యంగా ఉంచబడటంతో పాటు అధిక మొత్తంలో గంజాయి సమాచారం అందించిన భారీ గా నగదు పురస్కరం అందజేయబడుతుందని.గంజాయి రహిత పోలీస్ కమిషనరేట్ మనందరి ప్రధాన లక్ష్యమని పోలీస్ కమిషనర్ ప్రకటన లో తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular