Wednesday, February 18, 2026

తెరుచుకున్న జగన్నాధుని ఖజానా గది

ద్రోణ ఒడిశా :జులై 14

ఒడిశాలోని పూరీ జగన్నా థుడి రత్న భాండాగారం తెరుచుకుంది. మధ్యాహ్నం 1.28 గంటలకు ప్రత్యేక పూజల నిర్వహించి కలెక్టర్, హైలెవల్ కమిటీ పర్యవే క్షణలో రహస్య గది తలుపులను తెరిచారు.
జగన్నాథుడి సేవలకు అంతరాయం కలగకుండా తలుపులను తెరిచారు. 11మంది ఈ ప్రక్రియలో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. 46ఏళ్ల క్రితం అంటే 1978లో చివరి సారిగా దీన్ని తెరిచారు. రత్నభండార్ లోకి కమిటీ సభ్యులు ప్రవేశించారు. మొత్తం ప్రక్రియను కమిటీ సభ్యులు వీడియో తీస్తున్నారు. స్వామివారి నగలు, ఆభరణాలు తరలించేందుకు బాక్సులను అధికారులు సిద్ధం చేశారు. రత్న భాండాగారంలోని ఆభరణాల లెక్కింపు, తదితర ప్రక్రియను చేపట్టనున్నారు. 1978లో సంపదను లెక్కించడానికి 72 రోజులు సమయం పట్టింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular