Wednesday, February 18, 2026

ఉద్యోగాల పేరుతో 84 లక్షలు వసూళ్లు

కలెక్టర్ సంతకం కూడా ఫోర్జరీ చేసారు.

ద్రోణ సంగారెడ్డి ప్రతినిధి

సంగారెడ్డి జిల్లాలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల పేరుతో భారీ మోసం.అంగట్లో సరుకుల్లా నర్స్ పోస్టులు అమ్మకానికి పెట్టిన కిలాడి లేడీలు అనురాధ, మరియమ్మ.నిజమే అని నమ్మి తాళి పూస్తేలు కుదువపెట్టి, అప్పు చేసి కట్టిన ఒక్కొక్కరు 3 లక్షల రూపాయలు కట్టిన బాధితులు.
సంగారెడ్డి, జహీరాబాద్, బోధన్ కి చెందిన 28 మంది నుంచి 84 లక్షల రూపాయలు వసూళ్లు చేయడమే కాకుండా సంగారెడ్డి కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి కలెక్టరేట్ లోనే నకిలీ అపాయింట్ మెంట్ ఇచ్చిన కిలాడి మహిళలు.
డ్యూటీ కోసం సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి వెళ్లగా బయటపడ్డ అసలు విషయం, తమ డబ్బులు తమకు ఇవ్వాలని బాధితులు నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతున్న ముఠా. ఇంట్లో చెప్పలేక, జాబ్ కోసం చేసిన అప్పు తీర్చలేక ఆత్మహత్యాయత్నం చేస్కుంన్నారు కొందరు బాధితులు ఈ ఘటన వెనుక అసలు సూత్రధారులు వేరే వాళ్ళు ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్న బాధితులు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular