బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ద్రోణ కరీంనగర్
మాజీ మంత్రి హరీష్‌రావుపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు మంచి నాయకుడని, ఆయన ప్రజల మనిషి అని కొనియాడారు. హరీష్ బీజేపీలోకి వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని సూచించారు. తాను హరీష్ రావుతో మాట్లాడలేదని, ఆయన వివాద రహితుడని ప్రశంసించారు . బీఆర్ఎస్ పార్టీలో ఆయనొక్కడే మంచి నేత అని చెప్పారు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీనం ఒక డ్రామా అని విమర్శించారు.
బీజేపీలోకి ఎమ్మెల్యేలు వస్తే రాజీనామా చేయాల్సిందేనని షరతు పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే ఉప ఎన్నికలకు వెళ్లాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యేలు ఏ గుర్తుతో గెలిచి ఏ పార్టీలో చేరుతున్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి వన్ టైం సెటిల్ మెంట్ ఎవరికోసం తీసుకువచ్చారని నిలదీశారు. రేవంత్ ప్రకటనతో కాలేజీ యాజమాన్యాలు తల్లిదండ్రులను వేధిస్తాయని బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
