Tuesday, February 17, 2026

హైదరాబాదులో భారీ వర్షం

ద్రోణ హైదరాబాద్ : జులై 14

గత కొన్ని రోజులుగా హైద రాబాద్ నగరంలో దాదాపు ప్రతి రోజూ ఏదో ఒక చోట వర్షం పడుతూనే ఉంది. ఆదివారం సాయంత్రం కూడ హైదరాబాదులోని పలు ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, హైదర్ నగర్, కూకట్ పల్లి, మూసాపేట్, బాచుపల్లి, కేపీహెచ్ బీ కాలనీ, ప్రగతి నగర్ తోపాటు.నిజాంపేట్, మల్కాజిగిరి, నేరేడ్ మెట్, కుషాయిగూడ, చర్లపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈశాన్య రుతుపవనాలు క్రియాశీలకంగా ఉండడంతో పాటు, ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రా ల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular