ద్రోణ కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని టి ఎస్ ఆర్ టి సి కొత్త బస్టాండ్ ను మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలిచిన అనతి కాలంలోనే మహాలక్ష్మి ఉచిత బస్ పథకం రావడం చాలా సంతోషకరం అన్నారు. కామారెడ్డి బస్టాండ్ బస్సులో మహిళలతో మాట్లాడి మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. డిపో మేనేజర్ తో మాట్లాడి కామారెడ్డిలో ఉన్న బస్సులు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి సరైన సమయంలో బస్సులు ఏర్పాటు చేయాలని, కాలేజ్ విద్యార్థులకు ఇబ్బంది కాకుండా చూడాలని మరియు అరుణాచలం కి బస్సు కేటాయించాలని తెలియజేశారు. బస్టాండ్లో మరుగుదొడ్లు మరియు మంచి నీళ్ల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని డిపో మేనేజర్ ఇందిరాకి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, మున్సిపల్ కమిషనర్ సుజాత, వార్డ్ కౌన్సిలర్ పాత శివ కృష్ణమూర్తి, చాట్ల వంశీ,సలీం, పంపరి శీను, అనూష ప్రసన్న సుగుణ,పాల్గొన్నారు.
