అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ బోధన్‌లో కొవ్వొత్తుల ర్యాలీ

పోలీసుల సేవలకు విద్యార్థుల సంఘీభావం

బోధన్, అక్టోబర్ 31 (ద్రోణ):- దేశ ప్రజల భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులకు నివాళులర్పిస్తూ బోధన్ పట్టణంలో శనివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా పట్టణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టారు.

బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ర్యాలీని ప్రారంభించగా, పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బోధన్ బస్టాండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అనిల్ టాకీస్ చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నినాదాలు చేశారు.

ప్రజల ప్రాణ, ఆస్తుల పరిరక్షణతో పాటు శాంతిభద్రతల నిర్వహణలో పోలీసులు అందిస్తున్న సేవలను ఈ కార్యక్రమం గుర్తుచేసింది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని ర్యాలీలో పాల్గొన్నవారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్‌హెచ్‌ఓ వెంకటనారాయణ, రూరల్ సీఐ విజయ్ బాబు, రుద్రూర్ సీఐ కృష్ణ, ఎస్‌ఐలు రాజశేఖర్, గంగాధర్, శ్రీనివాస వంశీ, రామ్, హబీబ్, రాజు, పోలీస్ సిబ్బంది, విద్యా వికాస్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: యం.నాగేశ్వరావు

9848680568

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular